ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
పల్నాడు: ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఉగాది పండుగను ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.