లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
KMR: ఎమ్మెల్యే మదన్ మోహన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యం, వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ఈ ఆర్థిక సాయాన్ని ఆయన పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు ఏ ఆపద వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.