విజేత మార్ట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

విజేత మార్ట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ పాత ట్రస్ట్ ఎదురుగా ఉన్న విజేత మార్ట్‌లో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సొళ్ళు పిండి, ఖర్జూరం వంటి పదార్థాలు నాణ్యత లోపంతో పెంకు పురుగులతో ఉండటంతో వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించారు. నాణ్యత లోపించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.