'అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దు'

GDWL: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ళరాదు. చెట్ల కింద, పాడైపోయిన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉండకూడదని, కరెంటు స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ముట్టుకోరాదనీ, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.