జాతీయ స్థాయి వర్క్ షాప్‌కు నందమూరు సర్పంచ్ ఎంపిక

WG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో మార్చి 4వ తేదీన జరగనున్న జాతీయ స్థాయి వర్క్ షాప్‌నకు తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామ సర్పంచ్ శనగన వరలక్ష్మి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి 25 మంది మహిళలు ఎంపిక కాగా వారిలో వరలక్ష్మి ఒకరు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పలువురు సర్పంచులు అభినందనలు తెలిపారు.