STEP-UPతో విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన
VSP: జీవీఎంసీ ఆధ్వర్యంలో STEP-UP కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎక్స్పోజర్ విజిట్ గురువారం నిర్వహించారు. బ్యాంకులు, జీవీఎంసీ కార్యాలయాలు, PM బాక్సీ కంటైనర్ టెర్మినల్‌లను సందర్శించి ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. SBI శాఖల్లో బ్యాంకింగ్ విధానం, జీవీఎంసీలో సర్టిఫికెట్ల జారీపై వివరించారు. 135 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.