ఘనంగా సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు
KDP: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను మంగళవారం ఎర్రగుంట్లలో జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సింగం శివ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కొనియాడారు.