జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త..!
PPM: ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పార్వతీపురం జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డీహైడ్రేషన్ గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు మధ్యాహ్నం వేళ బయటకి రావొద్దని సూచించింది