అక్షరాంధ్ర కార్యక్రమం పక్కాగా చేపట్టాలి: కలెక్టర్

PPM: జిల్లాలోని నిరక్షరాస్యులైన వారికి అక్షర జ్ఞానం కలిగించి, వారికి ఫైనాన్షియల్, డిజిటల్ లిటరసీపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అక్షరాస్యత 57 శాతంగా ఉందని, గిరిజన ప్రాంతాల్లో సుమారు 44 శాతం మాత్రమే అక్షరాస్యత ఉందన్నారు. ఈ విషయమై మన్యం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.