విజయనగరం నగరపాలక సంస్థకు 7వర్యాంకు

విజయనగరం నగరపాలక సంస్థకు 7వర్యాంకు

విజయనగరం నగరపాలక సంస్థకు 7వ ర్యాంకును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 మునిసిపాలిటీలకు పది అంశాల ఆధారంగా ప్రభుత్వం రేటింగ్‌ ఇచ్చింది. మొత్తం 100 మార్కులకు గానూ, 61 శాతం రేటింగ్‌తో నగరపాలక సంస్థ ఏడో ర్యాంకు సాధించింది. గార్బేజ్‌, వీధి దీపాల నిర్వహణ, నీటి నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, ఆదాయం, రెవెన్యూ స్కోరును పరిగణనలోకి తీసుకున్నారు.