10 రోజులైనా గ్యాస్ సిలిండర్ రాట్లే సార్..!
MDCL: కాప్రా, A.S రావు నగర్ డివిజన్‌లో గ్యాస్ సిలిండర్ సరఫరా తీవ్ర ఆలస్యంగా జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ బుక్ చేసిన తరువాత దాదాపు పది రోజులు గడిచినా ఒక్కోసారి డెలివరీ కావటం లేదని, ఈ పరిస్థితి గృహిణులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తోందన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.