చిన్న తాండ్రపాడులో ముఖ హాజరుపై అవగాహన
GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ అథెంటికేషన్‌పై అవగాహన కల్పించారు. మార్చి 2 నుంచి తెలంగాణలో ముఖ హాజరు విధానం అమల్లోకి వచ్చిందని జిల్లా కోఆర్డినేటర్ ఎం.జి. నరసింహులు తెలిపారు. పని ప్రారంభం, ముగింపులో ఫోటో తీయించుకుంటేనే హాజరు నమోదై వేతనాలు జమ అవుతాయని చెప్పారు.