‘ఐఏఎస్ అధికారులను ఆరు నెలలకే మారుస్తారా?’

‘ఐఏఎస్ అధికారులను ఆరు నెలలకే మారుస్తారా?’

TG: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలపై మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేవలం ఆరు నెలలకే అధికారులను మార్చడం వల్ల వారికి పాలనపై అవగాహన రాదని విమర్శించారు. 'ప్రభుత్వానికి నచ్చితేనే పోస్టింగ్ ఇస్తారా?' అని ప్రశ్నిస్తూ, 105 మంది అధికారుల బదిలీని తప్పుబట్టారు. పాలన సక్రమంగా సాగాలంటే అధికారులు కనీసం రెండున్నరేళ్ల పాటు ఒకే పదవిలో కొనసాగాలని, అప్పుడే ఫలితాలు వస్తాయని చెప్పారు.