'మగ్గబెట్టిన పండ్ల విక్రయంపై తనిఖీలు చేపట్టాలి'
E.G: రసాయనాలతో పండ్లను మగ్గబెట్టి విక్రయించడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడా శ్రీనివాస్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథలిన్ రసాయనాలతో పచ్చి మామిడిని కృత్రిమంగా పండించడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన చెందారు. అధికారులు ఈ అక్రమాలను అరికట్టకపోవడం దారుణమని, తక్షణమే తనిఖీలు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.