సర్పంచ్ అభ్యర్థికి తుపాకీతో బెదిరింపు

సర్పంచ్ అభ్యర్థికి తుపాకీతో బెదిరింపు

TG: ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిని తుపాకీతో బెదిరించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రణవెల్లిలో నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని సర్పంచ్ అభ్యర్థి బాపును ఆగంతకుడు బెదిరించాడు. అనంతరం దళం పేరిట లేఖ ఇచ్చి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.