VIDEO: భక్తులతో కిక్కిరిసిన ఒంటిమిట్ట కోదండ రామాలయం
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ముగిసిన తర్వాత కూడా పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. రామాలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. రామనామ స్మరణంతో మార్మోగింది.