ఆ మరపురాని క్షణాలకు 15 ఏళ్లు
MS ధోనీ నేతృత్వంలో భారత్ వన్డే వరల్డ్ కప్-2011 గెలిచిన మరపురాని క్షణాలకు నేటితో 15 ఏళ్లు పూర్తవుతోంది. 28 ఏళ్ల తర్వాత దేశానికి రెండో కప్ అందించేందుకు ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్సర్‌ను ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. ముంబై వేదికగా శ్రీలంకపై సాధించిన నాటి చిరస్మరణీయ విజయంలో యువరాజ్(21 రన్స్ & 2 వికెట్లు), గౌతమ్ గంభీర్(97 రన్స్) కీలక పాత్ర పోషించారు.