క్యాన్సర్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
సత్యసాయి: పుట్టపర్తిలోని సత్యసాయి పాలియేటివ్ కేర్, క్యాన్సర్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాన్సర్ చివరి దశలో ఉన్న వారికి ఈ కేంద్రం అందిస్తున్న ఉచిత సేవలు అభినందనీయమని కొనియాడారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి నిర్వాహకులు ఉన్నారు.