మీ ఆహారంలో ఫైబర్ ఉందా?
శరీర ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్య పోషకాల్లో ఫైబర్ ఒకటి. ఇది కొలెస్ట్రాల్‌ని కరిగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటం మొదలు షుగర్ నియంత్రణ వరకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కలిగిస్తుంది. వీటి కోసం ఒక రోజులో పురుషులు 38గ్రా, స్త్రీలు 30, పిల్లలు 15గ్రా ఫైబర్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ కోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.