సొంత నిధులతో బోరు వేయించిన మాజీ కౌన్సిలర్

సొంత నిధులతో బోరు వేయించిన మాజీ కౌన్సిలర్

మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని పాలకొండ వార్డులో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. స్థానికులు ఈ విషయాన్ని మాజీ కౌన్సిలర్ మూస నరేందర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన మంగళవారం తన సొంత నిధులతో నూతన బోర్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తానన్నారు.