VIDEO: మూడేళ్లుగా పెండింగ్ బిల్లులు – మాజీ సర్పంచ్ నిరసన
WGL: పర్వతగిరి మండలం హట్యాతండా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనానికి సంబంధించిన బిల్లులు మూడేళ్లుగా చెల్లించబడకుండా పెండింగ్‌లో ఉన్నాయని మాజీ సర్పంచ్ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్ ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ చెల్లింపులు జరగలేదని ఆయన అన్నారు. స్థానికులతో కలిసి ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.