VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు
MNCL: బెల్లంపల్లి పట్టణంలో సోమవారం ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉదయమే చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నోటీస్ బోర్డుల్లో తమ గదులను సరిచూసుకుని అభ్యర్థులు లోపలికి వెళ్లారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.