తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా.. భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,772 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,013 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.1.47 కోట్లుగా నమోదైంది.