ఈనెల 7న హాకీ పండగ
AKP: భారతదేశంలో హాకీ ఆటకు 100 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా ఎలమంచిలిలో ఈనెల 7న హాకీ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కొఠారు నరేష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా హాకీ ఆటపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. అలాగే వివిధ స్థాయిలో హాకీ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.