యుద్ధం.. USలోని సామాన్యుడి జేబుకు చిల్లు

యుద్ధం.. USలోని సామాన్యుడి జేబుకు చిల్లు

పశ్చిమాసియాలోని యుద్ధ ప్రభావం అమెరికాలోని సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతోంది. దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా USలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం చేతులెత్తేశాయి. థర్డ్ పార్టీ సెల్లర్స్‌పై 3.5 శాతం ఇంధన సర్‌ఛార్జి విధిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.