VIDEO: 'మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

VIDEO: 'మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

KMM: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం కూసుమంచి మండలం పాలేరులో మిషన్ భగీరథ కార్మికులు విధులను బహిష్కరించి ధర్నా చేశారు. గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ కార్మికులను రెగ్యులర్ చేసి నెల నెల సకాలంలో జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.