జర్నలిస్టులకు ప్రత్యేక పాసులు మంజూరు చేస్తాం: ఎస్పీ

VZM: జిల్లా వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో ప్రత్యేక పాస్‌లు మంజూరు చేస్తామని ఎస్పీ వకుల్ జిందల్ ప్రకటించారు. ఆదివారం ZP సమావేశ మందిరంలో APUWJ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు QR కోడ్‌తో కూడిన వెహికల్ పాస్‌లు మంజూరు చేసి పోలీస్ సిబ్బందికి తగు సూచనలు జారీ చేస్తామన్నారు.