రోడ్డు ప్రమాదంలో.. ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో.. ముగ్గురికి గాయాలు

NLR: బుచ్చి పట్టణంలోని కానగ చెట్టు వద్ద జొన్నవాడ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ పేట నుంచి నెల్లూరుకి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని నెల్లూరు నుంచి బుచ్చి వైపు వెళ్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. అందులో ఇద్దరికీ కాళ్లు విరిగాయి. మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు.