విజయ్ వ్యాఖ్యలపై రజనీ ఫ్యాన్స్ ఆగ్రహం
తమిళనాడులో రజనీకాంత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య పోస్టర్ల యుద్ధం మొదలైంది. రజనీకాంత్‌కు డీఎంకే అంటే భయమని విజయ్ చేసిన వ్యాఖ్యలపై సూపర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. 'నిన్నగాక మొన్న వచ్చిన వారు విమర్శిస్తారా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీ రాజకీయాల్లోకి రాకపోవడంతో తమకు అవమానం మిగిలిందని ఆవేదన చెందుతూనే, ఆయనను విమర్శించిన వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.