మత్స్యకారులకు మోటార్ ఇంజన్లు పంపిణీ

మత్స్యకారులకు మోటార్ ఇంజన్లు పంపిణీ

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చెందిన పదిమంది మత్స్యకారులకు 40% రాయితీపై మోటారు ఇంజన్లను శనివారం హోంమంత్రి అనిత క్యాంపు కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ పంపిణీ చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద వీటిని అందజేసినట్లు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.