మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయండి: MEO

SKLM: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించాలని MEO ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. గురువారం పోలాకి మండలం తలసముద్రం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి మరింత నాణ్యతతో కూడిన భోజనం విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు.