జిల్లాలో 'వస్తా నీవెనుక' సినిమా షూటింగ్

సత్యసాయి: కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 'వస్తా నీవెనుక' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రత్యేక పూజల అనంతరం తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రంలో కదిరి పట్టణానికి చెందిన ప్రసాద్ రెడ్డి కుమారుడు నికిత్ హీరోగా నటిస్తున్నారు. సినిమా సిబ్బంది పాల్గొన్నారు.