పోచంపల్లిని సందర్శించిన యాదాద్రి కలెక్టర్
BHNG: యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి ఇవాళ భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ డాక్టర్ సీత సత్యనారాయణ, ధర్మకర్త మండలి సభ్యులు కలెక్టరు ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.