ప్రైవేట్ పాఠశాలల అక్రమాల పై కలెక్టర్‌కు వినతి

ప్రైవేట్ పాఠశాలల అక్రమాల పై కలెక్టర్‌కు వినతి

WGL: నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలని బహుజన విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన 'ప్రజావాణి'లో కలక్టర్ స్నేహ శబరీష్‌కు వినతి పత్రం అందజేశాయి. నియమాలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో బహుజన విద్యార్థి నేతలు ఉన్నారు.