సిద్దవటంలో ఘనంగా మేడే వేడుకలు

సిద్దవటంలో ఘనంగా మేడే వేడుకలు

కడప: సిద్ధవటం RTU యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సిద్ధవటం బస్టాండ్‌లో వారు కార్మిక జెండాను ఆవిష్కరణ చేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కొండయ్య హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిగా ఇమామ్ కాసిం, జిల్లా ట్రెజరీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.