16 వేల బాంబులతో భీకర దాడి

16 వేల బాంబులతో భీకర దాడి

ఇరాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) మునుపెన్నడూ లేని రీతిలో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏకంగా 16,000 బాంబులను ప్రయోగించి, 4,000 శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు IDF అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు సుమారు 800 సార్లు ఇరాన్ గగనతలంలోకి దూసుకెళ్లి ఈ భారీ ఆపరేషన్ నిర్వహించాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.