LPG కొరత.. బెంగాల్ స్కూల్లో వింత నిర్ణయం
పశ్చిమ బెంగాల్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా 'పానీ పూరీ'ని వడ్డించారు. స్కూల్లో LPG గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో చేసేదేమీ లేక పాఠశాల యాజమాన్యం బయట నుంచి పానీ పూరీ బండిని పిలిపించి పిల్లలకు మధ్యాహ్న భోజనంగా పెట్టారు. ప్లేట్లు పట్టుకుని లైన్లలో నిలబడి మరీ చిన్నారులు పానీ పూరీలను ఇష్టంగా తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.