రామాలయ భూమి కబ్జాపై ఫిర్యాదు

కోనసీమ: కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో రామాలయానికి చెందిన భూమి కబ్జాకు గురైందని గ్రామస్థులు ఆరోపించారు. సోమవారం తహశీసిల్దార్ సుబ్బలక్ష్మికి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 648/2 లోని 0.39 సెంట్ల భూమిని కొందరు ఆక్రమించారని పేర్కొన్నారు. ఆలయ భూమిని సర్వే చేసి తిరిగి అప్పగించాలని గ్రామస్థులు కోరారు.