పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం
NRPT: నర్వ(మం) పెద్దకడ్మూర్ గ్రామానికి చెందిన గజేంద్రుడు (25) గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లి, కొడుకుల మధ్య జరిగిన గొడవ కారణంగా మనోవేదనకు గురై ఈ చర్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే గమనించి, 108 అంబులెన్స్‌లో అతడిని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.