పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
కడప జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును డిసెంబర్ 6 వరకు పొడిగించినట్లు DEO షంషుద్దీన్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చునన్నారు. మరిన్ని వివరాలకు bse.ap.gov.in వెబ్ సైటును సంప్రదించాలి. సమస్యలుంటే 8096457660 నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు.