ఆన్‌లైన్ బెట్టింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించే 'గేమింగ్ బిల్లు'కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బెట్టింగ్ చేయడం నేరంగా పరిగణించబడుతుంది. అయితే ఈ బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.