నూతన పంచాయతీ పాలకులను సన్మానించిన ఎమ్మెల్యే

నూతన పంచాయతీ పాలకులను సన్మానించిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఇవాళ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు వారందరినీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.