ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

AP: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో అధికారులు ఉదయం 5 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13,05,400 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ దగ్గర గోదావరి నీటిమట్టం 13.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.