చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని 3 రోజుల క్రితం ఆటో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన ఆటో యజమాని మృతి చెందాడు. రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన బొమ్మన వేణి రాజు (41) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.