రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
AP: తిరుమలలో రేపటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేలా టీటీడీ ఉత్సవాలు చేయనుంది. రేపు ఉదయం 6.30కు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగింపు నిర్వహించనున్నారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకువెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు రథంపై మలయప్పస్వామిని ఊరేగించనున్నారు.