అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ గడువు పొడిగింపు

NRML: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు గడువును ఈనెల30 వరకు పొడిగించినట్లు నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం.సుధాకర్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కో-ఆర్డినేటర్ డా.యు.గంగాధర్ పేర్కొన్నారు.