విద్యుత్ సమస్యలపై ప్రజలకు అవగాహన
ATP: వజ్రకరూరు మండల కేంద్రంలో మంగళవారం విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 'మన ఊరు-మన విద్యుత్' కార్యక్రమంపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఈ ఖాదర్ వల్లి మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యలపై ప్రజల నుంచి ఆరా తీశారు. విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.