గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

ASF: గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆసిఫాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జువ్వాజి అనిల్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్థులు పాల్గొన్నారు.