గృహ నిర్మాణ పరిశీలన సమీక్షలో పాల్గొన్న మంత్రి

BDK: ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణ పరిశీలన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రారంభించనున్నట్లు తెలిపారు.