పదవి విరమణ పొందిన వారిని సన్మానించిన సీపీ

పదవి విరమణ పొందిన వారిని సన్మానించిన సీపీ

MDCL: రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తూ పదవి విరమణ పొందిన ముగ్గురు అధికారులను సీపీ సుధీర్ బాబు రాచకొండ పోలీస్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, పోలీసు శాఖలో సమర్థవంతంగా తమసేవలు అందించినందుకు అభినందించారు. వారికి రావలసిన అన్నిరకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.